సింహాచలం, యాదగిరి మంచి స్నేహితులు. ఇద్దరూ వీలు చిక్కినప్పుడల్లా కార్డ్స్ ఆడేవారు. ఎప్పుడూ యాదగిరే నెగ్గేవాడు.'నువ్వు పేకలోనూ, ప్రేమలోనూ రెంటిలో అదృష్టవంతుడివి గురూ' అన్నాడు సింహాచలం.యాదగిరి 'ప్రేమ సరే, ప్రేమలో ఎలా అదృష్టవంతుడిని? నలభై ఏళ్ళు దాటినా నాకు పెళ్ళే కాలేదుగా' అని ఆశ్చర్యపోయాడు.'అదే నేను చెప్పేది' అన్నాడు సింహాచలం.
ఆర్మీ- పెళ్ళి!
సత్తెకాలపు సత్తెయ్య కొత్తగా సైన్యంలో చేరాడు. సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు తన చిన్న నాటి మిత్రుడితో తన అనుభవాన్ని, అభిప్రాయాలను ఇలా చెప్పుకొచ్చాడు.'నాకు అర్ధమైనదేమిటంటే సైన్యంలో చేరడం కూడా పెళ్ళి చేసుకోవడం లాంటిదే. మన హెయిర్ స్టైల్ మార్చుకోవలసి ఉంటుంది. మనం వేసుకునే దుస్తులు మన ఇష్టం కాదు. మన ఉత్తరాలను సెన్సార్ చేస్తారు. కేవలం మనం ఏం చేయాలో
ఫారిన్ రేట్స్
ఫారిన్‌లో సెటిలైన సుబ్బారావు ఇండియా వచ్చి తన చిరకాల మిత్రుడైన నాగేశ్వరరావును కలుసుకోడానికి ఒక టౌన్‌కి వెళ్తాడు. మిత్రులిద్దరూ కబుర్లు చెప్పుకుని ఖుషీగా కాలక్షేపం చేశారు.ఒక సాయత్రం ఇద్దరూ అలా పార్కులో షికారుకెళ్ళారు. వారికి హొయలు ఒలకబోస్తున్న ఒకమ్మాయి ఎదురైంది. ఆమె కాల్‌గర్ల్ కావచ్చనుకుని సుబ్బారావు ఆమె చెయ్యి పట్టుకుని 'నాతో వస్తావా, వెయ్యి రూపాయలు ఇస్తాను' అంటాడు.ఆ మాట వినడమే తరువాయి నాగేశ్వరరావు ఫారిన్ రిటర్నుడ్ సుబ్బారావును చిత్తుగా కొట్టాడు.'నాదే తప్పు. మీ ఊరు వచ్చి కన్పించిన ఆడకూతురు చెయ్యి పట్టుకుని అలా మాట్లాడడం నిజంగా నాదే తప్పు. నీకు కోపం రావడం సహజమే. నన్ను క్షమించు' అన్నాడు సుబ్బారావు.నాగేశ్వరరావు విసుక్కుంటూ 'అందుక్కాదు, మా ఊళ్ళో రేట్లు ఎవరు పెంచినా నాకు చెడ్డ కోపమొస్తుంది' అని వివరణ ఇచ్చాడు.
జర్మనీ ప్రజలు
టీచర్: టర్కీలో ఉంటున్న ప్రజలను ఏమని పిలుస్తారు?విద్యార్ధి: తెలియదు, టీచర్‌టీచర్: టర్క్‌లు అంటారు. మరి జర్మనీలో ఉన్న వారిని ఏమంటారు
చిలిపి ఎస్ ఎంఎస్‌లు
జీవితంలో పైకి రావాలంటే కలలు కనే మనసు ఉండాలి. కలల్ని సాకారం చేసుకోగలిగిన పట్టుదల కావాలి. మంచి రూపం, నాలెడ్జి ఉండాలి. నువ్వు చాలా గ్రేట్. ఇవ్వన్నీ లేకుండానే బతికేస్తున్నావు.
హార్డ్‌కోర్ ఫెమినిస్టుని ఒకతను ఇలా ప్రశ్నించాడు.
''మహిళ తన జీవితంలో చేసే అతి కష్టమైన పని ఏమిటి''.
ఆవిడ ఏ మాత్రం తడుముకోకుండా....''మగవాళ్ళని భరించడం'' అని చెప్పింది.
కానీ అలా అన్న కొన్ని రోజులకే ఆమె వివాహం చేసుకుంది. దాంతో బోలెడంత ఆశ్చర్యపడిన ఆ యువకుడు, 'అంత కష్టమైన పని'ని ఎందుకు చేశారని అడిగాడు.
' ఏమీ లేదు. థియరిటికల్‌గా ఆలోచించి మీకు సమాధానం ఇచ్చాను. కానీ ఆ తరువాత అనిపించింది. ప్రాక్టికల్‌గా తేల్చుకుంటే బాగుంటుందని? .'' అంది.
ఒక యువకుడు డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.
''డాక్టర్! మా ఆవిడకి గొంతు పోయింది...ఏ రకమైన ట్రీట్‌మెంట్ ఇప్పించాలంటారు;'' అడిగాడు.
'' ఇంత మాత్రం దానికి డాక్టర్ ఎందుకయ్యా....ఓ నాల్రోజుల పాటు పొద్దున్న 3 గంటలకి ఇంటికెళ్ళి చూడు.....'' తేలిగ్గా కొట్టిపారేశాడు డాక్టర్.
బుద్ధిలేని బాబు
సైకాలజీ టీచర్: మీలోఎవరైనా తనకు తాను మూర్ఖులనుకొంటుంటే పైకి లేచి నిలబడండి ?4 (కొన్ని సెకండ్లలో టింకు అనే అబ్బాయి లేచి నిలబడ్డాడు)
సైకాలజీ టీచర్: ఏంటి టింకు, నీకు నువ్వు మూర్ఖుడనుకొంటున్నావా ?8 టింకు: లేదు మేడమ్, మీరు మాత్రమే నిల్చొంటేనూ...!
అంత పేదవాళ్లా?
టింకు: మమ్మీ, ప్రసాద్ వాళ్లు చాలా పేదవాళ్లా?అమ్మ: అంత పేదవాళ్లేమీ కాదే. ఎందుకడుగుతున్నావు?టింకు: మొన్న ప్రసాద్ ఒక రూపాయి తిన్నందుకే అంత రాద్ధాంతం చేశారు.అమ్మ:!!!!?????
పెద్ద తప్పు
టీచరు: టింకు, ఎప్పుడూ గొడవపడే మీ అమ్మానాన్న ఏ విషయంలోనైనా ఏకీభవిస్తారా?టింకు: పిల్లల్ని కనుక్కోవడం పెద్ద తప్పన్న విషయంలో...టీచర్:!!!!!????
చర్చిల్ హాస్యం
రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కు విజయం సాధించిపెట్టిన ఘనత విన్‌స్టన్ చర్చిల్‌దే అంటారు చరిత్రకారులు. ఆయన సంభాషణల్లో హాస్యం పాలు ఎక్కువగా ఉండేది.
ఓ సారి తన సహచర రాజకీయనాయకురాలైన నాన్సీ ఆస్టర్ చర్చిల్‌నుద్దేశించి 'నువ్వుగనుక నా భర్త అయితే...కాఫీలో విషం కలిపేదాన్ని' అందట. దానికి చర్చిల్ సైతం 'నువ్వేగనుక నా భార్య అయితే...ఆ కాఫీని నేను తాగేవాడిని'అని ధీటుగా స్పందించారట
'సీ' లెవల్‌కు కిందే
ప్రశ్న: రాము రిపోర్టు కార్డు ఎందుకు తడిగా ఉంది?
జవాబు: అతని గ్రేడులన్నీ 'సీ' లెవల్‌కు కిందే ఉంది
రజనీకాంత్‌కు తిట్లు
రాము: ఆ భిక్షగాడు 'రజనీకాంత్‌ను ఎందుకు తిట్టుకొంటున్నాడు ?౨౬సోము: 'శివాజీ' సినిమాను చూసిన తర్వాత ఎవరూ రూపాయికి పైన భిక్షం వెయ్యడం లేదట. అడిగితే...కోటీశ్వరుడయ్యేందుకు ఆ ఒక్క రూపాయి చాలంటున్నారట.
దెబ్బపై దెబ్బ
రాము: బిజినెస్‌ను నేను మరో భార్యగా భావిస్తా.
సోము: బిజినెస్ పట్ల మీకు అంత ఇష్టమా ?14
రాము: కాదు..బిజినెస్‌లో నాకు దెబ్బపై దెబ్బ తగులుతోంది.
సోము: ...!!!! ?
ఇంగ్లీషులో చెప్పు తెలుగు
పిల్లలను పరిచయం చేసుకుంటున్నాడు కొత్తమాస్టారుమాస్టారు : ఒరేయ్.. నీ పేరు, మీ నాన్న పేరు చెప్పరా..విద్యార్థి : నా పేరు చిట్టిబాబు, మా నాన్న పేరు సూర్యప్రకాశ్ అండీ..మాస్టారు : ఏదీ.. దాన్నే ఇంగ్లీషులో చెప్పు చూద్దాం..విద్యార్థి : నా పేరు లిటిల్ బాయ్, మా నాన్న పేరు సన్ లైట్ అండీ..మాస్టారు : ఆ ??!
