Custom Search

ఫారిన్‌ రేట్స్‌

ఫారిన్‌లో సెటిలైన సుబ్బారావు ఇండియా వచ్చి తన చిరకాల మిత్రుడైన నాగేశ్వరరావును కలుసుకోడానికి ఒక టౌన్‌కి వెళ్తాడు. మిత్రులిద్దరూ కబుర్లు చెప్పుకుని ఖుషీగా కాలక్షేపం చేశారు.ఒక సాయత్రం ఇద్దరూ అలా పార్కులో షికారుకెళ్ళారు. వారికి హొయలు ఒలకబోస్తున్న ఒకమ్మాయి ఎదురైంది. ఆమె కాల్‌గర్ల్‌ కావచ్చనుకుని సుబ్బారావు ఆమె చెయ్యి పట్టుకుని 'నాతో వస్తావా, వెయ్యి రూపాయలు ఇస్తాను' అంటాడు.ఆ మాట వినడమే తరువాయి నాగేశ్వరరావు ఫారిన్‌ రిటర్నుడ్‌ సుబ్బారావును చిత్తుగా కొట్టాడు.'నాదే తప్పు. మీ ఊరు వచ్చి కన్పించిన ఆడకూతురు చెయ్యి పట్టుకుని అలా మాట్లాడడం నిజంగా నాదే తప్పు. నీకు కోపం రావడం సహజమే. నన్ను క్షమించు' అన్నాడు సుబ్బారావు.నాగేశ్వరరావు విసుక్కుంటూ 'అందుక్కాదు, మా ఊళ్ళో రేట్లు ఎవరు పెంచినా నాకు చెడ్డ కోపమొస్తుంది' అని వివరణ ఇచ్చాడు.

0 Responses to "ఫారిన్‌ రేట్స్‌"